ETV Bharat / state

కష్టాల్లో గురువు... అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న ఆ విద్యార్థులు వారి గురువుకు ఏదో చేయాలని తపించారు. పూర్వ విద్యార్థులు చేయి చేయి కలిపి విద్యాబుద్ధులు నేర్పిన గురువుకి అండగా నిలిచారు.

కష్టాల్లో గురువు... అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు
కష్టాల్లో గురువు... అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు
author img

By

Published : Aug 2, 2020, 8:44 PM IST

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారానికి చెందిన రఘు ఉపాధ్యాయుడు. ఓ ప్రైవేటు స్కూల్​తో పాటు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. 1993లో సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో టీచర్​గా జీవనం ప్రారంభించిన ఆయన మొన్నటి వరకు ఓ ప్రైవేటు స్కూల్​లో విధులు నిర్వర్తించాడు.

చేయూత..

అతని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గురువు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న 1997- 98 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆయనకు బాసటగా నిలిచారు. విద్యాబోధన నేర్పిన గురువుకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారు. వారందరూ... కలిసి ఆ గురువు దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. టిఫిన్ సెంటర్​తో పాటు చికెన్ సెంటర్ ఏర్పాటు చేయిస్తే తమ కుటుంబాన్ని పోషించుకుంటానని గురువు పూర్వ విద్యార్థులకు తెలిపాడు.

ఇతరులకు స్ఫూర్తి...

అందరూ కలిసి కథలాపూర్ మండలం అంబారిపేట క్రాసింగ్ వద్ద ఓ షెడ్డు నిర్మించి టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి అందుకు కావాల్సిన సామగ్రిని అందజేసి ఇవాళ ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు.. ఆపదలో ఉన్న తనను ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని రఘు చెబుతున్నాడు. మా గురువు వల్లే ఈ స్థాయిలో ఉన్నామని.. లేకుంటే మేము ఈ స్థాయిలో ఉండేది కాదని పూర్వ విద్యార్థులు అన్నారు. కష్టాల్లో గురువుకు అండగా నిలిచిన విద్యార్థులు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.