జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్కు ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులతో తీసుకెళ్తున్న బస్... వేగంగా వెళ్లి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మిషన్ భగీరథ కోసం తవ్విన పైపు లైను మట్టిలో టైర్లు కూరుకుపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పినందున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!