ETV Bharat / state

వీడీసీలను రద్దు చేసే వరకు పోరాడతాం : సర్పంచ్ శ్రీనివాస్ - sarpanch srinivas fasting protest Latest News

గ్రామ అభివృద్ధి కమిటీ పేరిట సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మనగర్ సర్పంచ్ శ్రీనివాస్ నిరహార దీక్షకు దిగారు. వీడీసీ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ అరాచకాలను అరికట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్... సర్పంచ్ దీక్షకు సంఘీభావం తెలిపి విరమింపజేశారు.

వీడీసీలను రద్దు చేయాలని సర్పంచ్ నిరాహార దీక్ష

author img

By

Published : Aug 22, 2020, 12:27 AM IST

Updated : Aug 22, 2020, 12:33 AM IST

గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీనివాస్ హరే కృష్ణ.. నిరహార దీక్ష చేపట్టారు. రామలచ్చకపేట్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాము వీడీసీ సభ్యులమని... రైతులు శ్రీరామ్ సాగర్ వరద కాల్వ ద్వారా చెరువులకు, పొలాలకు నీరు తీసుకున్నందున 50 వేల రూపాయలు ఇవ్వాలని వేధిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. లేకపోతే వరద కాల్వ నుంచి మోటర్ల తీసివేస్తామని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి...

రైతులకు న్యాయం జరగాలంటే రామలచ్చక్కపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ స్పష్టం చేశారు. స్పందించిన మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సర్పంచ్ దీక్షకు సంఘీభావం తెలిపి విరమింపజేశారు.

చర్యలు తీసుకుంటాం ...

విషయం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దృష్టికి వెళ్ళగా వీడీసీ నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ శ్రీనివాస్ హరే కృష్ణ వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో వీడీసీ సభ్యులపై కేసు నమోదైందని... ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవాలంటూ కమిటీ రాయబారాలు చేస్తోందని ఆయన తెలిపారు.

అసలు వీడీసీలు ఉండకూడదు...

భవిష్యత్​లో ఏ గ్రామంలోనూ రైతులకు, మత్స్య సొసైటీ చెరువులకు, గంగపుత్రులకు నీటిపై వేధింపులు ఉండకూడదంటే వీడీసీలు రద్దు కావాలని సర్పంచ్ వివరించారు. డబ్బుల పేరిట ఇబ్బందులకు గురిచేసే గ్రామ అభివృద్ది కమిటీని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిలివేరి విజయ్, గ్రామ యువత, మహిళలు , స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం

Last Updated : Aug 22, 2020, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.