ETV Bharat / state

Negligence of Doctors: వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులో కాటన్.. మళ్లీ ఆపరేషన్​ - Medical Health Department

Negligence of government doctors: ఓ గర్భణి ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కడుపులో కాటన్ పెట్టి ఆపరేషన్​ చేశారు. ఈ విషయం ఆ మహిళ 16 నెలలు తరువాత తెలుసుకొని మళ్లీ ఆ ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్​ చేసి కాటన్​ను బయటకు తీశారు.

Negligence of Doctors
Negligence of Doctors
author img

By

Published : Apr 18, 2023, 4:18 PM IST

Negligence of government doctors: జగిత్యాలలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఓ మహిళా ప్రాణాల మీదికి తెచ్చింది. ఆపరేషన్‌ చేసిన వైద్యులు కడుపులోనే కాటన్​ను మరిచిపోయారు. దీంతో మళ్లీ ఆపరేషన్‌ చేసి తీయాల్సి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన నవ్య అనే గర్భణి గత 16 నెలల క్రితం ప్రసవం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరింది. ఆపరేషన్​ చేసిన వైద్యులు కడుపులో గుడ్డను మరిచిపోయారు. అయితే ఇన్నాళ్లు బాగానే ఉన్న ఆమెకు కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది.

మళ్లీ ఆపరేషన్​ చేసిన వైద్యులు: స్కానింగ్‌ చేసిన వైద్యులకు కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించారు. అవాక్కైన బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారిని నిలదీసింది. దీంతో వైద్యులు హుటాహుటిన మళ్లీ ఆపరేషన్‌ చేసి కాటన్​ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

"నాకు డెలివరీ అయినా నెల తరవాత నుంచే కడుపులో ఏదో తెలియని నొప్పి వచ్చేెది. ఆహారం ఏది తీసుకున్న జీర్ణం అయ్యేది కాదు. దీంతో కొన్ని రోజులు చిన్న నొప్పి అనుకొని ఉండిపోయాను. క్రమేనా నొప్పి ఎక్కువ అయినందున వేరే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి నీకు కడుపులో గుడ్డ పెట్టి ఆపరేషన్​ చేశారని చెప్పారు. వెంటనే ఆ ఆసుపత్రికి వచ్చి అడిగాను. దీంతో మళ్లీ ఆపరేెషన్​ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నాకు ఈ పరిస్థితి ఏర్పడింది."-నవ్య, బాధితురాలు

ఎడమ కాలికి బాగోలేదని.. కుడి కాలికి ఆపరేషన్​: ఇదే విధంగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లును రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒకరికి 6 నెలలు మరోకరికి 3 నెలలు వారి గుర్తింపును రద్దు చేసింది. అసలు ఏమి చేశారంటే.. ఒక రోగి తన ఎడమ కాలికి బాగోలేదని డాక్టర్​ను ఆశ్రయించాడు. అనంతరం ఆ వైద్యుడు ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్​ కుడి కాలికి చేశాడు. దీన్ని వారు రెండు రోజుల తరువాత గుర్తించారు. అనంతరం ఆ రోగికి మళ్లీ ఎడమ కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని బాధితుడు డీఎంహెచ్​ఓకి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపి.. వైద్యునికి 6 నెలలు వేటు వేశారు.

డాక్టర్​ గమనించలేదు.. రోగి మృతి చెందాడు: మంచిర్యాల జిల్లా వాసి డెంగీతో బాధపడుతూ.. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్యం చేసిన తరవాత సరిగ్గా పరిశీలించ లేనందున.. రోగి పరిస్థితిని విషమంగా మారింది. ఈ విషయం గమనించని డాక్టర్​ శ్రీకాంత్​.. వేరే ఆసుపత్రికి వెళ్లమని చెప్పలేదు. దీంతో ఆ రోగి మృతి చెందాడు. ఈ కారణంగా ఆ డాక్టర్​ను 3 నెలలు తన గుర్తింపును రద్దు చేశారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మహిళా ప్రాణాలు మీదకు వచ్చింది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.