ఆరేళ్ల తెరాస ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఉద్యోగుల జీవితాలు బాగుపడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించారు.
కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఆడబిడ్డలైన మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని జీవన్ రెడ్జి విమర్శించారు. ఒప్పంద ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని శాసించిన ఉపాధ్యాయ సంఘాలు నేడు దీన స్థితికి దిగజారడం బాధాకరమన్నారు.