ETV Bharat / state

సీఎం అవిశ్రాతంగా కృషి చేస్తున్నారు: సుంకె రవిశంకర్ - Sunke Ravishankar laid the foundation stone for seven check dam structures

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో .. ఏడు చెక్ డ్యాం నిర్మాణాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. మెట్ట ప్రాంతాల్లో చెక్ డ్యాం నిర్మాణాలు భూగర్భ జలాలు పెంచేందుకు ఉపకరిస్తాయని తెలిపారు.

mla Sunke Ravishankar laid the foundation stone for seven check dam structures
సీఎం అవిశ్రాతంగా కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
author img

By

Published : Dec 28, 2020, 8:00 PM IST

కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో .. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ. 9 కోట్లతో ఏడు చెక్ డ్యాం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గౌరాపూర్, పూడూరు, అప్పారావుపేట, నాచుపల్లి, గ్రామాల్లో ఈ నిర్మాణలు భూగర్భ జలాలు పెంచేందుకు ఉపకరిస్తాయని తెలిపారు.

స్వల్ప కాలంలో ..

రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో ఉండేందుకు ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమాతో పాటు.. ఉచిత విద్యుత్తు లాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని స్వల్ప కాలంలో పూర్తి చేసి.. తెరాస రైతు ప్రభుత్వంగా నిలిచిందన్నారు.

సాగు విస్తీర్ణం పెరిగింది

రాష్ట్రంలో రైతులు బాగుపడేందుకు ముఖ్యమంత్రి అవిశ్రాతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. యాసంగిలో రైతుబంధు సహాయంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7,515 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గతంలో కంటే సుమారు 40వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రూ. 80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి.. సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.