జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేట శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ నుంచి భారీగా మంచి నీరు లీకై వృథా అవుతోంది. సుమారు గంట సేపు నీరు వృథాగా పోయినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపంతో చేపట్టిన పనుల కారణంగా లీకేజీలు ఏర్పడి లక్షల లీటర్ల నీరు వృథా అవుతోందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని కోరారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా