కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ స్వయంభు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, అన్న పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్తీకమాసం సందర్భంగా గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్తీక మాస విశిష్టతను ఆలయ పూజారి అరవింద్ శాస్త్రి భక్తులకు వివరించారు.
ఇదీ చదవండి: భద్రాచలంలో శోభాయమానంగా కార్తీక కాంతులు