జగిత్యాలలో జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ... 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు మొత్తం 1022 వాహనాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు.
ప్రజలందరూ కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనాలు సీజ్ చేసి వాహనదారులపై కేసులు పెడతామని ఎస్పీ సింధూ శర్మ హెచ్చరించారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా