సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్ప ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి సామూహిక పాలాభిషేకం చేశారు. కన్నెమూల గణపతి ఆలయం నుంచి స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో గణపతి, కలశ పూజ చేశారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కల్యాణం కన్నుల పండువగా చేశారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరయ్యారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు అయ్యప్పస్వామి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఇవీ చూడండి: "దిశ" కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ దాఖలు