ETV Bharat / state

కన్నుల పండువగా గోదా రంగనాథ స్వామి కల్యాణం - తెలంగాణ వార్తలు

మెట్​పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథుని కల్యాణం ఘనంగా జరిపారు. వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు దంపతులు పాల్గొన్నారు.

godha ranganatha swamy kalyanam at sri kodanda ramalayam in metlapally jagtial
కన్నుల పండువగా గోదా రంగనాథ స్వామి కల్యాణం
author img

By

Published : Jan 12, 2021, 4:15 PM IST

ధనుర్మాస ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. మెట్​పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కల్యాణ తంతును భక్తిశ్రద్ధలతో జరిపారు.

వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కల్యాణ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి: కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.