కొవిడ్ కేసుల పెరుగుదలను మామూలు విషయంగా తీసుకోవద్దని... చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వారం రోజులుగా మండల పరిధిలో కరోనా కేసులు పెరగటంతో పాక్షిక లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని ప్రకటించారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. హోటళ్లలో రద్దీ తగ్గించేందుకు పార్శిల్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దుకాణాల యజమానులు కరోనా రెండో దశ విజృంభిస్తున్న క్రమంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: చిన్నారుల అదృశ్యంపై పూర్తి వివరాలు సమర్పించండి: హైకోర్టు