అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై భాజపా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు మండిపడ్డారు. విద్యాసాగర్‌రావు.. హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రామమందిర నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే నిధులను సమీకరిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని శాసనసభ్యుడు తెలుసుకోవాలని సూచించారు. క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'