MP RRR ON SIT NOTICES : "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు.
దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు నిందితులుగా ఉండగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో సిట్ కొత్తగా చేర్చింది.
ఇవీ చదవండి: