ఆంధ్రప్రదేశ్ గుంటూరులో పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయటం వివాదాస్పదంగా మారింది. షీ టీమ్‌లలో పనిచేసే మహిళా పోలీసుల కోసం ద్విచక్ర వాహనాలు సమకూర్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చేతుల మీదుగా వీటిని మహిళా పోలీసులకు అందజేశారు.
అయితే ఆ వాహనాలకు వైకాపా రంగులు వేసి.. షీ టీమ్ సభ్యులకు పంపిణీ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైకాపా రంగులతో కూడిన ద్విచక్ర వాహానాలు ఎస్పీ ప్రారంభించారు. వీటిలో ఎక్కువ వాహనాలు పాతవే ఉన్నాయి. వాటికి అధికార పార్టీ రంగులు వేసి పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది.