ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం నుంచి సీబీఐ విచారణ మొదలుపెట్టింది. విచారణలో భాగంగా కడప ఎస్పీ అన్బురాజన్‌తో ఏడుగురు సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత పులివెందులకు వెళ్లనున్న సీబీఐ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష