Young Man Hulchal in Nandyala Video Viral: సరైన పత్రాలు లేని కారణంగా ఓ యువకుడి బండి తాళాన్ని ట్రాఫిక్ ఎస్సై లాక్కోవడంతో.. ఆ ఎస్సై ఫోన్‌ను యువకుడు తీసుకుని వీరంగం సృష్టించిన ఘటన ఏపీలోని నంద్యాలలో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మణికంఠ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు.
మణికంఠ సరైన బండి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు బండి తాళం తీసుకున్నారు. తాళం తీసుకోవడంతో.. ఎస్సై చేతిలో సెల్‌ఫోన్‌ను యువకుడు లాక్కొని ఇచ్చేందుకు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. యువకుడి తీరుపై ట్రాఫిక్ ఎస్సై లక్ష్మయ్య ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిపైన కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: