ETV Bharat / state

PETROL PRICES: వాస్తవానికి లీటరు పెట్రోలు మూలధర రూ.40.90 మాత్రమే.. కానీ - రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్​ ధరలు

సామాన్యుడికి అత్యవసరమైన పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. మూలధర తక్కువగానే ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే సుంకాలు, పన్నులు ఎక్కువగా ఉండటంతో పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటగా.. డీజిల్‌ ధర సైతం వందకు చేరువ అవుతోంది. ఇంధనాల మూల ధర కంటే ఇవే అధికంగా ఉంటున్నాయి. సుంకాలు, పన్నుల వల్ల ఏడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు రూ.36 లక్షల కోట్లు సమకూరింది.

PETROL PRICES
PETROL PRICES
author img

By

Published : Jul 12, 2021, 5:35 AM IST

‘ఈ దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది’.. అప్పుడెప్పుడో సినీ కవి రాసిన ఈ వాక్యం పెట్రోలు, డీజిల్‌ మీద పన్నుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి సరిగ్గా సరిపోతుంది. గత ఏడేళ్లలో పెట్రో రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన రాబడి.. రూ.36 లక్షల కోట్లు. కేంద్ర వాటా 67.59%, రాష్ట్రాల వాటా 32.41%. ఈ మొత్తం ఆదాయంలో పెట్రోలు, డీజిల్‌పై కేంద్రానికి ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలకు వ్యాట్‌/ అమ్మకపు పన్ను రూపంలో వచ్చే ఆదాయమే రూ.28 లక్షల కోట్ల వరకు ఉంది. అంటే మొత్తం పెట్రోరంగ ఆదాయంలో 77%కు పైగా కేవలం ఈ రెండు ఇంధనాలపైనే పిండుకుంటున్నాయి. అయినా రోజురోజుకూ పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలను పెంచుతూనే ఉన్నాయి. వాస్తవానికి లీటరు పెట్రోలు మూలధర రూ.40.90 మాత్రమే. కానీ, దానిపై కేంద్ర ఎక్సైజ్‌ సుంకం రూ.32.90. రాష్ట్ర పన్నులు రూ.27.31. వీటికి డీలర్‌ కమీషన్‌ కూడా తోడై వంద రూపాయలు దాటిపోతోంది.

సామాన్యుడికి అత్యవసరమైన పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. మూలధర తక్కువగానే ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే సుంకాలు, పన్నులు ఎక్కువగా ఉండటంతో పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటగా.. డీజిల్‌ ధర సైతం వందకు చేరువ అవుతోంది. కరోనాతో అన్ని రంగాలూ కుదేలై ప్రజల ఆదాయ స్థాయిలు పడిపోయినా.. కేంద్రం మాత్రం ఈ రెండు ఇంధనాలపై పన్నుల భారాన్ని మరింత పెంచింది గతేడాది మార్చి వరకూ (2020 మార్చి 14 ముందు) ఉన్న పన్నును పరిశీలిస్తే.. లీటరు డీజిల్‌పై రూ.16 వరకు, పెట్రోలుపై రూ.13 మేర భారం పెరిగింది.

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇలా...

తమిళనాడు రాజధాని చెన్నైతో పోలిస్తే.. తెలంగాణలో ఇంధన ధరలు అధికమే. లీటరు పెట్రోలుపై రూ.5.20, డీజిల్‌పై రూ.5.01 చొప్పున అదనంగా చెల్లించాలి. మన పక్కనే ఉన్న యానాం వెళ్తే లీటరు పెట్రోలు రూ.7 తక్కువకే లభిస్తుంది. డీజిల్‌పైనా రూ.5 వరకు తక్కువే. అక్కడికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడలో మాత్రం అధికమే. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌ కంటే తక్కువే ఉన్నాయి.

.

ఖజానాకు కాసుల వర్షం

2019-20లో దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 19.06 కోట్ల టన్నులు కాగా కేంద్ర, రాష్ట్రాలకు రూ.5.55 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, 2020-21లో కరోనా ప్రభావంతో అమ్మకాలు 17.27 కోట్ల టన్నులకు (9.4% తగ్గుదల) పడిపోయాయి. అయినా గానీ కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం మాత్రం రూ.6.71 లక్షల కోట్లకు చేరింది. అంటే.. రూ.1.16 లక్షల కోట్లు (20.9%) పెరిగింది. ఇంకా వివరంగా చూస్తే.. కేంద్రానికి వచ్చే ఆదాయం ఏడాదిలో రూ.1.20 లక్షల కోట్లు పెరిగింది.. రాష్ట్రాల ఆదాయం మాత్రం రూ.4 వేల కోట్లు తగ్గింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచడం వల్లే కేంద్రానికి గతేడాది భారీగా కాసుల వర్షం కురిసింది.

రెట్టింపైన ఆదాయం.. మహమ్మారి సమయంలో మరీ అధికం

కేంద్రప్రభుత్వానికి పెట్రో రంగం నుంచి వచ్చే ఆదాయం కేవలం నాలుగేళ్లలోనే రెట్టింపైంది. 2014-15లో రూ.1.72 లక్షల కోట్లు ఉండగా.. 2018-19 నాటికే రూ.3.48 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4.53 లక్షల కోట్లు రాబట్టింది. అంటే ఆరేళ్లలో.. రూ.2.81 లక్షల కోట్లు పెరిగింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూపంలోనే 2016-17లో రూ.2.43 లక్షల కోట్లు రాగా.. తర్వాత మూడేళ్లు తగ్గింది. మళ్లీ 2020-21లో రూ.3.71 లక్షల కోట్లకు పెరిగింది. 2014-15 నుంచి 2020-21 మధ్య రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో మూడింట ఒక వంతు పెరుగుదలే కనిపించింది. మొత్తంగా పెట్రోరంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు వచ్చే సొమ్ము రూ.3.40 లక్షల కోట్లు పెరిగింది.

అన్నింటికంటే ..

దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పన్ను భారం అధికంగానే ఉంది. మూడేళ్ల కిందటి నాటితో పోలిస్తే.. లీటరుకు రూ.3 పైగా పెరిగింది. 2018లో పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.4 నుంచి రూ.2 చేశారు. అంటే లీటరుకు రూ.2 తగ్గింది. 2020 జులై 20న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 18న మరోసారి సవరించారు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ వసూలు చేయాలని నిర్ణయించారు. అనంతరం రోడ్డు అభివృద్ధి సుంకం పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారు. మళ్లీ దానిపైనా వ్యాట్‌ ఉంది.

కనిపించని పన్నులెన్నో...

పెట్రోరంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముడిచమురు, పెట్రో ఉత్పత్తులపై పన్నులు, డివిడెండ్‌/ ఆదాయపు పన్ను రూపాల్లో ఆదాయం లభిస్తోంది. ఇందులో అత్యధికంగా కేంద్రానికి ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలకు వ్యాట్‌/ అమ్మకపు పన్నుల ద్వారా వస్తుంది. ఇవి కాక వేసే పన్నులు/ఆదాయ మార్గాలు పరిశీలిస్తే..

కేంద్రానికి: ముడి చమురుపై సెస్‌, రాయల్టీ, జాతీయ విపత్తు, ఆకస్మిక నిధి పన్ను (ఎన్‌సీసీడీ), కస్టమ్స్‌ సుంకం, సేవా పన్ను, సమీకృత జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ), కేంద్ర వస్తుసేవల పన్ను (సీజీఎస్‌టీ), ఆదాయపు పన్ను, డివిడెండ్‌, లాభాల్లో వాటా

రాష్ట్రాలకు: ముడిచమురు/ సహజ వాయువుపై రాయల్టీ, రాష్ట్ర వస్తుసేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ), కేంద్ర వస్తుసేవల పన్ను (సీజీఎస్‌టీ), ఆక్ట్రాయ్‌, విద్యుత్తు పన్ను, ప్రవేశ పన్ను, లాభాల్లో డివిడెండ్‌

.
.
.
.
.
.

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.