ETV Bharat / state

వాట్సాప్‌లో గుట్టు.. జర భద్రం

నిత్యం మనం వాడే వాట్సాప్​ను ఛాట్ యాప్​లాగా వాడటమే కాకుండా ఇతరుల స్టేటస్​లు చూడటానికి, పేమెంట్స్​ని చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాం. కానీ వాట్సాప్​ని వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అవన్నీ తెలుసుకొని వాడితేనే మనకు మంచిది.

WHATS APP FEATURES
వాట్సాప్‌లో గుట్టు.. జర భద్రం
author img

By

Published : Apr 14, 2020, 1:43 PM IST

వాట్సాప్‌ని మొదట్లో ఛాట్‌ యాప్‌లాగే చూశారు.. కానీ, కొన్నేళ్ల తర్వాత పరిస్థితి మారింది.. వాట్సాప్‌ ఇప్పుడు కేవలం మెసెంజర్‌లా టెక్స్ట్‌ ఛాట్‌ చేయడానికే కాదు. సోషల్‌ మీడియా వేదికగా మారిపోయింది. గ్రూపులుగా ఏర్పడి క్షణాల్లో సమాచారాన్ని పంచుకోవడం.. స్టేటస్‌ మెసేజ్‌లను అప్‌డేట్‌ చేయడం.. కాల్స్‌ మాట్లాడడం.. ఇలా చాలానే చేస్తున్నాం. మీరెప్పుడైనా ఆలోచించారా? వాట్సాప్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి? ఎందుకంటే.. మీ అప్‌డేట్స్‌ని తెలుసుకునేందుకు వాట్సాప్‌కి ఎలాంటి ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ పంపనక్కర్లేదు. మీ నంబర్‌ తెలిస్తే చాలు. నిత్యం మీ ‘స్టేటస్‌’పై ఓ కన్నేయడం చాలా ఈజీ!
అక్కర్లేనివి తొలగిద్దాం
ఫోన్‌బుక్‌లో వందల్లో కాంటాక్ట్‌లు ఉంటాయి. వాటిల్లో కొన్ని నంబర్లు ఎవరివో కూడా మర్చిపోతుంటాం. అలాంటివి ఫోన్‌ బుక్‌లో ఉన్నంత వరకూ ఎలాంటి సమస్య ఉండదు. అదే వాట్సాప్‌లో మీరుంటే? మీరు మర్చిపోయినా? అన్‌నోన్‌ కాంటాక్ట్‌లు మర్చిపోవు. మీ గురించి తెలుసుకుంటూనే ఉంటాయి. అందుకే.. ఎప్పటి నుంచో టచ్‌లో లేని కాంటాక్ట్‌లు, గుర్తు తెలియని ఫోన్‌ నంబర్లు ఉంటే వెతికి వెంటనే తొలగించండి. ఎప్పుడైనా అవసరం పడితే ఎలా? అనుకుంటే.. కాంటాక్ట్‌లను బ్లాక్‌ చేసైనా ఉంచండి. కావాలంటే అన్‌బ్లాక్‌ చేయొచ్చు. దీంతో మీ స్టేటస్‌లు, డీపీలు మీకు తెలిసిన వారికే కనిపిస్తాయి.
అన్నీ తెలిసేలా వద్దు
ప్రొఫైల్‌ ఫొటోలు ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాం. మీ ఒక్కరి ఫొటో రకరకాల మార్పులు చేసి పెట్టుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా కుటుంబ సభ్యుల ఫొటోలు, ఇతర అప్‌డేట్‌లను డీపీగా పెట్టడం సురక్షితం కాదు. మీరు పెట్టింది ఏదైనా కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారు ఎవరైనా చూడొచ్చు. మీ నుంచి ఎలాంటి అనుమతినీ కోరాల్సిన పని లేదు. అందుకే మీ ప్రైవసీని కాపాడుకునేలా ప్రొఫైల్‌ ఫొటో సెట్టింగ్స్‌ని మార్చుకోండి. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రొఫైల్‌ ఫొటోని Everyone కాకుండా My contactsలోకి మార్చేయండి. అప్పుడు కేవలం మీ అడ్రస్‌బుక్‌లో ఉన్నవారు మాత్రమే డీపీని చూడగలుగుతారు. ఫొటోని ఎవ్వరూ చూడొద్దు అనుకుంటే nobody గానూ పెట్టుకోవచ్చు.
బ్యాక్‌అప్‌ మాటేంటి?
ఉన్నాయి కదా క్లౌడ్‌ సర్వీసులు అని ఐక్లౌడ్‌, గూగుల్‌ డ్రైవ్‌లోకి వాట్సాప్‌ డేటాని ఆటో బ్యాక్‌అప్‌ చేస్తున్నారా? అయితే, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే.. వాట్సాప్‌లో డేటా ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో ఉంటుంది. ఇతరులు ఎవ్వరూ చూసేందుకు వీలుండదు. అదే ఐక్లౌడ్‌, గూగుల్‌ డ్రైవ్‌లకు ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు ఉండదు. అందుకే.. మీకు అవసరమైన, ముఖ్యమైన డేటాని మాత్రమే సురక్షిత స్టోరేజ్‌ స్థావరాల్లో భద్రం చేసుకోండి.
వెరిఫికేషన్‌ మార్చారా?
మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఒక్కసారి తెలుసుకుంటే చాలు. వాట్సాప్‌ ఎకౌంట్‌ని వేరే వాళ్లు యాక్సెస్‌ చేయొచ్చు. ఇలాంటి ‘సిమ్‌ స్వాప్‌’లకు దొరకొద్దు అనుకుంటే.. వాట్సాప్‌లోని Two-step verification ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయండి. అందుకు ఎకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ స్టెప్‌ వెరిఫికేషన్‌కి ఆరు అంకెల పిన్‌ నంబర్‌ని పెట్టుకోవచ్చు. దీంతో ఎప్పుడైనా వేరే ఫోన్‌లో మీ వాట్సాప్‌ ఎకౌంట్‌ని వాడాల్సి వస్తే.. కోడ్‌ని ఎంటర్‌ చేయాలి. మీ ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరూ మీ ఎకౌంట్‌ని వాడలేరు.
‘స్టేటస్‌’ పరిమితమేనా?
సందర్భాలు, సంతోషాల్ని స్టేటస్‌లో పెట్టేసి నలుగురూ చూసేలా చేస్తున్నాం. కానీ, మీరు పెట్టే స్టేటస్‌లను ఎవరు చూస్తున్నారు? పాలవాడు.. పేపర్‌బాయ్‌.. డ్రైవర్‌.. వీళ్లే కాదు. ఫోన్‌ కాల్స్‌తో తప్ప ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా కలవని వాళ్లు.. ఇలా ఎవరుబడితే వాళ్లు చూడడం ఎందుకు అని ఆలోచిస్తే.. ప్రైవసీ సెట్టింగ్స్‌ని మార్చేయండి. మీకు కావాల్సిన వారితోనే పంచుకోండి. అందుకు ‘ఓన్లీ షేర్‌ విత్‌..’ ఆప్షన్‌ ఉంది. అలాగే, కొందరికి తప్ప మిగతా అందరూ చూసేందుకు ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌..’ ఉంది.
మీరు అనుమతిస్తేనే..
ఈ మధ్య గ్రూపులు బాగా కట్టేస్తున్నారు. మరైతే, మీ ప్రమేయం లేకుండా ఇతరులు ఎవ్వరూ మిమ్మల్ని ఏ గ్రూపులోనూ యాడ్‌ చేయకూడదు అనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్‌ని మార్చేయండి. మీకు తెలిసిన వాళ్లు మాత్రమే గ్రూపు ఆహ్వానాల్ని పంపేలా సెట్‌ చేసుకోవచ్చు.

ఇవీ చూడండ: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.