ETV Bharat / state

Vinayaka stucked: కమాన్​ కింద చిక్కుకున్న వినాయకుడు.. - ఎర్రగడ్డ ఈఎస్​ఐ

హైదరాబాద్​లో ఓ భారీ వినాయక విగ్రహం ఓ కమాన్ కింద చిక్కుకుపోయింది. ఎర్రగడ్డ ఈఎస్​ఐ వద్ద ఏర్పాటు చేసిన కమాన్ కింద చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వినాయకున్ని తరలించేలా చర్యలు చేపట్టారు.

Vinayaka stucked
భారీ వినాయకుడు
author img

By

Published : Sep 9, 2021, 3:27 PM IST

నగరంలోని ధూల్​పేట్​ నుంచి బోరబండకు తీసుకెళ్తున్న వినాయక విగ్రహం అనుకోని రీతిలో కమాన్​ కింద చిక్కుకుపోయింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ వద్ద భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన కమాన్ పైభాగంలో ఈ భారీ వినాయక విగ్రహం కిరీటం తగలడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆ దారిలో ట్రాఫిక్ స్తంభించింది.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కమాన్ వద్ద ట్రాఫిక్​ను మరో మార్గంలోకి మళ్లించారు. విగ్రహం తరలిస్తున్న వాహనం టైర్లకు గాలి తీశాకే విగ్రహం ముందుకు కదలింది. అప్పటివరకు ఆ మార్గంలో వెళ్తున్న నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు.

కమాన్​ కింద చిక్కుకున్న భారీ వినాయకుడు

ఇదీ చూడండి: HIGH COURT: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.