డిజిటల్ మీడియా రంగంలో నిపుణులను తయారు చేసేందుకు కెనడా దేశానికి చెందిన వాన్ ఆర్ట్స్ స్కూల్ కమ్యూనికేషన్ సంస్ధ ముందుకు వచ్చింది. ఈ మేరకు దిల్సుఖ్నగర్లోని క్రియేటివ్ మల్టీ మీడియా సంస్థలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో వాన్ ఆర్ట్స్ స్కూల్ కమ్యూనికేషన్ మేనేజర్ కెన్ ప్రీ బీ, క్రియేటివ్ మల్టీమీడియా వ్యవస్థాపకుడు రాజశేఖర్ బుగ్గవీటి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. యానిమేషన్ రంగంలో ఆసక్తి కలిగిన విద్యార్థులు విదేశాలకి వెళ్లి చదువుకోవడానికి ఇదొక చక్కటి అవకాశమని క్రియేటిక్ సీఈవో రాజశేఖర్ తెలిపారు. శిక్షణ కోసం కెనడా రావాలనుకునే విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కెన్ ప్రీ బీ తెలిపారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే నాణ్యమైన విద్యనందిస్తామని ఆయన వివరించారు.
ఇవీ చూడండి: స్ట్రాంగ్ రూం వద్ద ఉత్తుత్తి సీసీ కెమెరాలు