ETV Bharat / state

Vacancies in Secretariat: చురుగ్గా సాగుతున్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు - తెలంగాణ సచివాలయంలో ఖాళీలు

Vacancies in Secretariat: రాష్ట్ర సచినాలయంలో సహాయ విభాగాధికారి ఖాళీలలను సాధారణ పరిపాలన శాఖ గుర్తించింది. వాటిపై ఆర్ధికశాఖకు ఓ నివేదిక ఇచ్చింది. అందులో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్​పీఎస్​సీ గ్రూప్‌-2 ద్వారా భర్తీ చేస్తారు.

Vacancies
Vacancies
author img

By

Published : Mar 19, 2022, 5:52 AM IST

Vacancies in Secretariat: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర సచినాలయంలో సహాయ విభాగాధికారి ఖాళీలలను సాధారణ పరిపాలన శాఖ గుర్తించింది. వాటిపై ఆర్ధికశాఖకు ఓ నివేదిక ఇచ్చింది. అందులో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్​పీఎస్​సీ గ్రూప్‌-2 ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 100 పోస్టులను పదోన్నతులు... కారుణ్య నియామకాలతోపాటు పన్నెండున్నరశాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త నియామకాల కోసం అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీకానున్నాయి.

ఖాళీల భర్తీ ప్రకటన సమయంలో యూనిఫాం సర్వీసులు మినహా ఇతర పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతున్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా... సాధారణ పరిపాలన శాఖలు ప్రతిపాదనలు రూపొందించాయి. ఒకటి రెండురోజుల్లో వాటిని సీఎం కేసీఆర్‌ అందిస్తాయి. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన వెంటనే జీఏడీ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.