ETV Bharat / state

అక్టోబర్​ 5న భూసంస్కరణలపై సెమినార్ : వీహెచ్​ - వీహెచ్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్​ 5న భూసంస్కరణలపై సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్​ నేత, పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షుడు వి.హన్మంతరావు, కన్వీనర్‌ మహేశ్‌గౌడ్‌ తెలిపారు. పీవీ నరసింహారావుకు అత్యంత ఇష్టమైన భూసంస్కరణలపై నిర్వహిస్తున్న సెమినార్‌లో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్​, పీవీతో అనుబంధం ఉన్న ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.

v hanumanth rao announcement on land reforms seminar
అక్టోబర్​ 5న భూసంస్కరణలపై సెమినార్ : వి. హనుమంతరావు
author img

By

Published : Sep 29, 2020, 8:49 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్​ 5న భూ సంస్కరణలపై సెమినార్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్​ సీనియర్​ నేత, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షులు వి.హన్మంతరావు, కన్వీనర్​ మహేష్ గౌడ్... గాంధీ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పీవీకి అత్యంత ఇష్టమైన భూ సంస్కరణల మీద ఇప్పటి వరకు రెండు సెమినార్లు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అక్టోబరు 5న ఇందిరా భవన్‌లో జరగబోయే మూడో సెమినార్​లో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్​, పీవీతో అనుబంధం ఉన్న ప్రముఖులు జూమ్​ యాప్​ ద్వారా పాల్గొంటారని పేర్కొన్నారు.

కీసరలో పేదలకు చెందిన 94 ఎకరాలు భూమి తిరిగి వారికే చెందినప్పుడే.. పీవీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసినట్లవుతుందని వీహెచ్​ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్​ కూడా ఈ సెమినార్‌లో నేరుగా పాల్గొంటే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.

అక్టోబర్​ 5న భూసంస్కరణలపై సెమినార్ : వి. హనుమంతరావు

ఇదీ చదవండిః 6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.