హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని లేక్ వ్యూ పార్కులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఉదయం రహదారులు శుభ్రం చేస్తున్న కార్మికులు... నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సుమారు 30 ఏళ్ళు ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఆ పార్కు మూత పడి ఉంది.
