ETV Bharat / state

KISHAN REDDY: 'పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తా'

author img

By

Published : Jul 10, 2021, 5:27 AM IST

దేశంలో పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తానని.. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనికి కొత్త జవసత్వాలు చేకూర్చే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలకు, అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలకు కొదవలేదని.. దగ్గరలోని అందాల్ని వదిలేసి చాలామంది ఎన్నో వ్యయప్రయాసలతో విదేశాలకు వెళ్తున్నారన్నారు. కారణం.. సరైన ప్రచారం.. మౌలిక సదుపాయాలు లేకపోవడమేనన్న కిషన్​రెడ్డి. ఈ ధోరణి మారాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్'​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివి..

union minister KISHAN REDDY
union minister KISHAN REDDY

కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. పర్యాటక రంగానికి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులను చేస్తుందని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ సర్కారులో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి వస్తుందని ఊహించలేదని.. మూడు శాఖలు ఇచ్చి పెద్ద బాధ్యత మోపారు. వాటిని ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థంగా నిర్వహిస్తానని.. తెలుగువారు గర్వపడేలా పనిచేస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, రాష్ట్రంలో భాజపా బలోపేతం కోసం గట్టి కృషి చేస్తానని స్పష్టంచేశారు.

  • కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభిస్తుందని ముందే ఊహించారా?

ప్రధాని మోదీ కేబినెట్‌లో పదోన్నతి వస్తుందని అనుకోలేదు. ఏకంగా మూడు శాఖలు.. అవీ ప్రధానమైనవి అప్పగించడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 68,000 కోట్ల భారీ బడ్జెట్‌ ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా అక్కడ అభివృద్ధి జరిగేలా చూడాలి. కేంద్రం తమను నిర్లక్ష్యం చేయట్లేదని, తమ అభివృద్ధిని కాంక్షిస్తుందన్న నమ్మకం వారిలో కల్పించడం.. తుపాకులతో హింసకు పాల్పడేవారిని ఆ మార్గానికి దూరం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది.

ఇదీచూడండి: KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'

  • రెండేళ్లలోనే కేబినెట్‌ మంత్రిగా పదోన్నతికి ఏమిటి కారణాలు?

ఆ విషయం ప్రధానమంత్రి మోదీకే తెలుసు. నేను ఇతర సహాయ మంత్రుల కంటే గొప్పవాడినేం కాదు. పార్టీ పెద్దలు, ప్రధాని, అమిత్‌షా ఆలోచించి నిర్ణయించారు. అమిత్‌షా దగ్గర పనిచేయడం మంచి అనుభవం. నాకు అప్పగించిన బాధ్యతలను కష్టపడి నిర్వర్తించా. నాపై నమ్మకంతో హోంశాఖకు సంబంధించిన కీలక అంశాలను అప్పగించారు. ఆ శాఖలో మరింతకాలం పనిచేయాలని మనసులో ఉండేది. అనుకోకుండా పదోన్నతి వచ్చింది. 3 శాఖలు రావడం.. వ్యక్తిగతంగా సవాలే. ఆ శాఖల పరిధిలోని ఐదుగురు సహాయమంత్రుల సహకారంతో సమర్థంగా పనిచేసి ప్రధాని దగ్గర, ప్రజల్లో పేరు తెచ్చుకుంటా.

ఇదీచూడండి: Kishan Reddy: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా... కిషన్​రెడ్డి ప్రస్థానం

  • పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టారు కదా.. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ఈ రంగాన్ని ఏ విధంగా ఆదుకోబోతున్నారు?

ట్యాక్సీలు.. హోటళ్లు.. గైడ్లు.. ఇలా ఎంతోమంది ఆధారపడిన ఈ రంగం తీవ్రంగా దెబ్బతిన్న విషయం యథార్థమే. పర్యాటకం ప్రధానమంత్రికి ఇష్టమైన రంగం. ఈ రంగానికి మంచిరోజులు తీసుకురావడం కోసం ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వేసిన మంత్రుల సబ్‌కమిటీకి నేను కన్వీనర్‌గా పనిచేశా. కరోనా తగ్గగానే.. దేశ ప్రజల కోసం ‘భారత్‌ అంతా చూడండి’ అనే కార్యక్రమం చేపడతాం. ఈ రంగానికి జవసత్వాలు కల్పించడంతో పాటు.. కొవిడ్‌కు ముందుకంటే ఎక్కువగా పర్యాటకాన్ని పరుగులు పెట్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సహకారమూ తీసుకుంటాం.

  • కృష్ణా జలాల వివాద పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాస్తున్న వరుస లేఖలపై మీరేమంటారు?

మంచి జరిగినప్పుడు తమ గొప్పతనమని.. చిన్న సమస్య వస్తే నరేంద్రమోదీ ప్రభుత్వానిది.. అన్నట్లుగా రెండు రాష్ట్రాలూ వ్యవహరిస్తూ కేంద్రంపై తోసేస్తున్నాయి. కృష్ణా జలాలు, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు సహా ఏ అంశమైనా రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుంది. తెలుగు ప్రజలు అనేక దశాబ్దాలు కలిసి ఉన్నారు. ప్రజల మధ్య విభేదాలు తీసుకురావొద్దు. ఆంధ్రా ప్రజల్ని రాక్షసులు అంటూ రాజకీయ నాయకులు మాట్లాడటం మంచిపద్ధతి కాదు. ఈ రెండు రాష్ట్రాల మధ్యేకాదు.. కర్ణాటక, మహారాష్ట్రలతో సమస్య ఉన్నా తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని చర్చించి పరిష్కరిస్తుంది. రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలి.

  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తారు?

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏకైక తెలుగు ప్రతినిధిగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. తెలంగాణ సొంత రాష్ట్రం.. ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రాథమిక బాధ్యత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఐదేళ్లు పనిచేశా. తెలంగాణ, ఏపీలో ఎన్నో చారిత్రక, పర్యాటక ప్రదేశాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధికైనా, ఏ సమస్య పరిష్కారానికైనా కృషిచేస్తా.

  • హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతోందన్న మంత్రి కేటీఆర్‌ విమర్శలపై ఏమంటారు? స్థానిక ఎంపీగా హైదరాబాద్‌ అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తారు? ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా?

స్థానిక ఎంపీగా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వీలున్నప్పుడల్లా వస్తున్నా. ఈఎస్‌ఐ ఆసుపత్రి అభివృద్ధికి.. బస్తీ దవాఖానాలకు నిధులిచ్చింది కేంద్రమే. నగర, పురపాలక సంస్థలకూ నిధులిస్తున్నాం. కరోనా వేళ.. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు ఇచ్చాం. హైదరాబాద్‌ నగరం విషయంలో నా బాధ్యత నిర్వర్తిస్తా. అభివృద్ధిపథంలో తీసుకెళతా. రక్షణ భూముల అంశం ఇప్పటిది కాదు. అక్కడ నిర్మాణాలకు అనుమతి రావడం కొంత కష్టమే. కీలకమైన రక్షణ విభాగాలు ఉండటంతో కొంత సమస్యగా ఉంది. అయినప్పటికీ అక్కడి మిలిటరీ అధికారుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం.

  • తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని.. కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై మీరేమంటారు?

ఆయన పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు? ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఎందరు ఆ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు. దీనస్థితిలో ఉందా పార్టీ. రాహుల్‌గాంధీయే పార్టీని నడపలేనంటూ అధ్యక్ష పదవిని వదిలేసి వెళ్లారు. తమ సంగతి చూసుకోకుండా భాజపాను, నన్ను విమర్శిస్తారా? ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలోనూ ఏడాదిన్నరగా కరోనా సంక్షోభం ఉంది. ఈ క్లిష్ట సమయంలో నేను ఎంత అండగా ఉన్నదీ, చేసిన కృషి ఏమిటీ అనేవి హైదరాబాద్‌ ప్రజలకు తెలుసు.

ఇవీచూడండి: కేంద్ర పర్యాటక మంత్రిగా అప్పట్లో మెగాస్టార్‌... ఇప్పుడు కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.