ETV Bharat / state

ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు - ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో ద్విచక్రవాహనాలు  దొంగిలిస్తున్న ఇద్దరిని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
author img

By

Published : Jul 16, 2019, 9:11 PM IST

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరిని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 లక్షల రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నాచారం అంబేడ్కర్ నగర్​కు చెందిన వేముల రాజుతో పాటు ఓ మైనర్ బాలుడు జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలను దొంగిలించారు. ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా తమ పంథాను మార్చుకోకుండా మళ్లీ ద్విచక్ర వాహనాలు దొంగిలించడం మొదలుపెట్టారు. నాచారం, ఉప్పల్ , చైతన్యపురి పీఎస్​ల పరిధిలో 3 బుల్లెట్​ వాహనాలతో పాటు మరో 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించారని మల్కాజిగిరి ఏసీపీ సందీప్ తెలిపారు. నాచారం చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బాలుడు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ సందీప్ వెల్లడించారు.

ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు

ఇవీ చూడండి: ' తొమ్మిదేళ్ల చిన్నారికి చిత్రహింసలు.. సవతితండ్రి కిరాతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.