ETV Bharat / state

'ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారమే బిల్లులు' - current bills news in telanagana

ఎక్కడ కూడా కరెంటు బిల్లును పెంచలేదని ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారమే బిల్లులు ఇస్తున్నామని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. 60 శాతం వినియోగదారులు మాత్రమే మూడు నెలల బిల్లును కట్టారు. ఎక్కువ చెల్లించిన బిల్లును డిడక్షన్ వేస్తామన్నారు.

tsspdcl
tsspdcl
author img

By

Published : Jun 6, 2020, 6:11 PM IST

Updated : Jun 6, 2020, 6:26 PM IST

లాక్‌డౌన్​తో ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లులు పెంచలేదని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్‌ కావడం వల్ల 13 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని... ఫలితంగా స్లాబ్‌లు మారాయని ఆయన పేర్కొన్నారు. వినియోగం పెరిగితే స్లాబ్‌ మారుతుందని వివరించారు.

ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 95.13 లక్షల వినియోగదారులున్నారని ఇందులో 70 లక్షలపై చిలుకు గృహ వినియోగదారులున్నారని పేర్కొన్నారు. అందులో 200 యూనిట్ల కన్నా తక్కువ వాడే వారు 86 శాతం ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో 60 శాతం వినియోగదారులు మాత్రమే మూడు నెలల బిల్లును కట్టారని తెలిపారు. బిల్లులు కట్టని వారికి వాయిదాలు ఇస్తామని.. అందుకు 1.5 శాతం వడ్డీ వసూలు చేస్తామన్నారు.

ఏప్రిల్, మే నెలలను పూర్తిగా లాక్​డౌన్, జూన్ నెలలో మిసహాయింపులు వల్ల రీడింగ్ తీస్తున్నాం. మూడు నెలల బిల్లుల యూనిట్లను మూడుతో భాగించి ఒక్కో నెలకు వేర్వేరు బిల్లులు ఇస్తున్నాం. కరోనా సమయంలో ఇంతకన్నా మంచి ఆప్షన్ లేదు. దీనివల్ల లబ్ధి పొందే వారే ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడం వల్ల 13 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో స్లాబ్​లు మారాయి. అందుకే వినియోగం పెరిగింది. ఎక్కువ చెల్లించిన బిల్లును డిడక్షన్ చేస్తాం. -రఘుమారెడ్డి, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ

ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారమే బిల్లులు

ఇదీ చూడండి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అక్రమాల మకిలీ

Last Updated : Jun 6, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.