ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుని ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాల నేతలు దూసుకెళ్లారు. ట్యాంక్‌బండ్ పైనున్న వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వటం వల్ల లాఠీ ఛార్జీ చేశారు. ఫలితంగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ లా అండ్ ఆర్డర్ చౌహన్ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన పరిస్థితిని సమీక్షించారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం