అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తెలంగాణ ఖ్యాతిని చాటిందని తెరాస ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు... తెలంగాణలోని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీసుకోవాలనిపించేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. తెరాస ప్రభుత్వం 38 లక్షల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు.
12 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. ప్రతీది వక్ర భాష్యం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెరాస మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించి అమలు చేస్తున్నారన్నారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. అన్ని రంగాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారని వివరించారు.
ఇదీ చదవండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం