ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై ఏసీపీకి తెరాస నాయకుల ఫిర్యాదు.. ఎందుకంటే? - cm kcr photo

trs leaders complaint against mp arvind: సీఎం ఫొటోను మార్ఫింగ్​ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఎంపీ అర్వింద్​పై తెరాస నాయకులు వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంపీ అర్వింద్​పై ఏసీపీకి తెరాస నాయకుల ఫిర్యాదు.. ఎందుకంటే?

author img

By

Published : Dec 31, 2021, 5:33 PM IST

trs leaders complaint against mp arvind: నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై తెరాస పార్టీ సోషల్​మీడియా కన్వీనర్​ సతీశ్​ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్​ ఫొటోను మార్ఫింగ్​ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఎంపీ అర్వింద్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్​ను అవమానిస్తే యావత్​ తెలంగాణ ప్రజలందరిని అవమానించినట్లేనని సతీశ్​ రెడ్డి అన్నారు. 24గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఎంపీ అర్వింద్​ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

తెరాస పార్టీ సోషల్​ మీడియా కన్వీనర్​ సతీశ్​ రెడ్డి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్టూన్​ను ఎంపీ అర్వింద్​ వక్రీకరించి సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. -పురుషోత్తం రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.