సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ డివిజన్లో తెరాస అభ్యర్థి అత్తిలి అరుణ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్ పరిధిలోని మేక్లేం గూడ, చుట్టాల బస్తీ ప్రాంతాల్లో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ తెరాస చేసిన అభివృద్ధిని తెలియజేశారు.
ప్రజలంతా తెరాస పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అభ్యర్థి అన్నారు. ఆరేళ్లుగా తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. తెరాస గెలిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ మెజారిటీతో తనని గెలిపించి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థి కోరారు.
ఇదీ చదవండి: 'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'