సరైన ధ్రువపత్రాలు లేకుండా ఆవులు, ఎడ్లను తరలిస్తున్న రెండు వాహనాలను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టోల్గేట్ వద్ద బీజేవైఎం, భాజపా నాయకులు అడ్డుకున్నారు. పశువులను తరలిస్తున్న వారికి, భాజపా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తరలింపుదారులు వాహనానికి అడ్డంగా పడుకుని ఆందోళన చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొడవను చక్కదిద్దారు. పశువైద్యాధికారి సూచనపై ధ్రువీకరణ పత్రాలు ఉన్న వాటిని విడిచిపెట్టి మిగతావాటిని గోశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: పోలీసులపై దాడి చేసిన రౌడీ షీటర్ అరెస్ట్