1. కొత్తగా 518 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,84,074 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 1,527 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తరతరాలకూ యాదికుండేలా
ఎటుచూసినా.. ఆధ్యాత్మికత ఉట్టిపడే కృష్ణ శిలా సౌందర్యం.. అద్భుత గోపురాలు.. ప్రభవించే ప్రాకారాలు.. ఆళ్వారులు.. దశావతారాలు.. ఒక్కటేమిటి ఆద్యంతం భక్తి పారవశ్యంలో ఓలలాడించే కళారూపాలకు ఆలవాలంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అందరి చూపు కొవాగ్జిన్ టీకా వైపే
కొవాగ్జిన్ టీకా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ట్వీట్ చేసింది. ఈ టీకాను ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వ్యాక్సినే విరుగుడు
ఏడాదిగా కరోనా కలవరపెడుతూనే ఉంది. కోట్ల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చి పరిస్థితులు కుదుటపడతాయని అనుకుంటున్నాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దేశంలో మరో 23,068
దేశవ్యాప్తంగా కొత్తగా 23,068 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 336 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆపరేషన్ యూకే
బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రారంభమవడం వల్ల భారత్ మరింత అప్రమత్తం అయింది. దీనిపై రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం అందించిన జాబితాతో బ్రిటన్ నుంచి వచ్చిన వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సిక్కు-అమెరికన్ల లేఖ
నూతన సాగు చట్టాల రద్దును కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలపై అగ్రరాజ్యం స్పందించాలని భారతీయ అమెరికన్ చట్టసభ్యుల బృందం ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకి లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అందుకే కలిశారా?
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించే అవకాశముందని సినీవర్గాల టాక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. హైదరాబాద్‌తోనే విలియమ్సన్
విలియమ్సన్ సన్‌రైజర్స్‌ను వీడనున్నాడంటూ వస్తున్న వార్తలపై వార్నర్ స్పందించాడు. వచ్చే ఏడాది అతడు తమ జట్టుతోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.