- ములుగు జిల్లాలో మావోయిస్టుల బంద్
ములుగు జిల్లాలో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. వాజేడు, వెంకటాచలం, కన్నాయిగూడెం మండలాలకు బస్సులు నిలిపివేశారు. మావోయిస్టు శంకర్ మృతిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ బంద్ చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్.!
వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని... వ్యవసాయేతర భూమిగా మార్చుకునే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు
'తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనాన్ని పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నూతన సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- తెలుగు రాష్ట్రాలకు అభినందనలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలి, మూడవ స్థానంలో నిలిచిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఘోర రోడ్డుప్రమాదం
రాజస్థాన్‌లోని భిల్వాడాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బిజౌలియాలోని కేసర్‌పురా వద్ద ఓ ట్రక్కు-వ్యాను ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు భిల్వాడా నుంచి కోటాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు రోడ్డు!
చైనాతో సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాలను వేగవంతం చేసింది భారత్. హిమాచల్‌ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు కీలక రహదారి పూర్తి కావస్తోంది. శత్రువులు గుర్తించేందుకు వీలు లేని ఈ రహదారి ద్వారా సైనికులను సురక్షితంగా సరిహద్దులకు చేర్చేందుకు వీలుకలగనుంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- అమెరికా, బ్రెజిల్లో ఆగని కరోనా ఉద్ధృతి
ప్రపంచదేశాలపై కొవిడ్-19 అంతకంతకూ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే సుమారు 2 లక్షల 69వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 2కోట్ల 70లక్షలకు ఎగబాకింది. వైరస్‌తో మరో 4,800 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 8లక్షల 83వేలు దాటింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆన్‌లైన్ ఆట.. మనదైన బాట!
దేశ సార్వభౌమత్వానికి, పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతోందంటూ పబ్జీ సహా.. 118 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. దేశంలో పబ్జీకి సుమారు 50కోట్ల మంది వినియోగదారులున్నారు. ఇంత ఆదరణ ఉన్న గేమింగ్ రంగంలో మనం వెనకబడినట్లే కనిపిస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మెరుపులన్నీ ఈ మైదానాల్లోనే!
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కాబోతుంది ఐపీఎల్ 13వ సీజన్. భారత్‌లో అయితే జట్టుకో స్టేడియం చొప్పున ఎనిమిది వేదికల్లో నిర్వహించేవారు. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో కేవలం మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ నిర్వహించే స్టేడియాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- అటు ఆట.. ఇటు నటన
టాలీవుడ్‌లోని కొందరు స్టార్స్.. నటనే కాకుండా క్రీడల్లోనూ మెప్పించారు. రకుల్ ప్రీత్, సుధీర్ బాబు, నాగశౌర్య తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి