ETV Bharat / state

రానున్న ఎన్నికల్లో అన్నిచోట్ల పోటీ: టీజేఏసీ

author img

By

Published : Oct 10, 2020, 10:40 PM IST

ప్రస్తుతం రాష్ట్రంలో జరగబోయే బల్దియా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ ఐకాస నిర్ణయించింది. తార్నాకలోని టీజేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఛైర్మన్ పురుషోత్తం ఈ విషయాన్ని వెల్లడించారు.

TJAC Will enter into MLC, GHMC Elections
రానున్న ఎన్నికల్లో అన్నిచోట్ల పోటీ: టీజేఏసీ

రాష్ట్రంలో జరగబోయే బల్దియా (జీహెచ్‌ఎంసీ), పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయనున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్ పురుషోత్తం ప్రకటించారు. ఈ మేరకు తార్నాకలోని టీజేఏసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఐకాస ఎన్నికల్లో అన్ని చోట్ల స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

పట్టభద్రులు ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఓటును నమోదు చేసుకొని...ఆలోచించి ఓటు వేయాలని టీజేఏసీ విజ్ఞప్తి చేసింది. బాధ్యతగల పౌర సంఘాలు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. నిరుద్యోగులకు ఎల్లప్పుడూ టీజేఏసీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు లక్షల 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఎన్నికల రంగంలో పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.