ETV Bharat / state

TRSPP: నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం... ఎంపీలకు సీఎం దిశానిర్దేశం - Parlament sessions

నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి జరిగే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

trs
తెరాస
author img

By

Published : Nov 28, 2021, 5:21 AM IST

TRSPP: ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి జరిగే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల లోపల బయట నిరసన వ్యక్తం చేయాలని... తెరాస ఆందోళన బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ (KCR) అధ్యక్షతన నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెరాస... ఇప్పటికీ విభజన హామీలను అమలు చేయక పోవడం... కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, ప్రోత్సాహకాలు లేకపోవడం వంటి అంశాలపై ధ్వజమెత్తుతోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ... పార్లమెంట్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని తెరాస భావిస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్రవిధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది. విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్‌ చేయనుంది.

నిన్న కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణకు.. రాష్ట్ర నేతల వ్యాఖ్యలకు పొంతన కుదరక పోవటం వల్ల.. పార్లమెంట్​ వేదికగానే స్పష్టత తెచ్చుకోవాలని గులాబీ ఎంపీలకు సీఎం సూచించనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష నేతలు సైతం.. రాష్ట్రం, కేంద్రం కుమ్మక్కై రైతులను అయోమయంలో పడేస్తున్న విషయాన్ని ఈ సమావేశాల్లోనే ప్రజలకు స్పష్టం చేయాలన్న యోచనలో వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.