ETV Bharat / state

జూబ్లీహిల్స్ శ్రీ‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Hyderabad latest news

జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు కొనసాగుతాయని తితిదే లోకల్‌ అడ్వైయిజరీ కమిటీ ఛైర్మన్ గోవింద్‌ హరి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

The first Brahmotsavam of Sri Venkateswara Swamy Temple in Jubilee Hills has started
జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
author img

By

Published : Mar 12, 2021, 7:50 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 21వరకు కొనసాగుతాయని తితిదే లోకల్‌ అడ్వైయిజరీ కమిటీ ఛైర్మన్ గోవింద్‌ హరి వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు హైదరాబాద్ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామి వారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు సహకరించాలన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో అధునాతన విద్యుత్తు వెలుగులు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.