ETV Bharat / state

కేంద్ర సహకారం అంతంత మాత్రంగానే ఉంది: నిరంజన్​రెడ్డి - updated news on central budget 2020

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​పై మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పందించారు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్ర సహకారం అంతంత మాత్రంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

The central contribution is endless: Niranjan Reddy
కేంద్ర సహకారం అంతంత మాత్రంగానే ఉంది: నిరంజన్​రెడ్డి
author img

By

Published : Feb 1, 2020, 7:23 PM IST

బడ్జెట్​లో వ్యవసాయ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపుగానే వ్యవహరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్​లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరమన్నారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న మంత్రి.. కేంద్రం వాటిని పట్టించుకోకపోవడం వ్యవసాయాన్ని విస్మరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే కోరుతున్నా.. కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధి హామీని అనుసంధానం చేస్తామనడం సరికాదని వాపోయారు.

పంట కాలనీల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందన్న మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం పంటకాలనీల కోసం సిద్ధం చేసిన ప్రణాళికకు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధరే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తలపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకూ కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం లభిస్తుందో కాలమే తేలుస్తుందన్నారు. వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో గత ఆరేళ్లుగా తెలంగాణను నడిపిస్తున్నారని.. ఈ విషయంలో కేంద్రం సహకారం మాత్రం అంతంతగానే ఉందని మంత్రి పెదవి విరిచారు.

ఇదీ చూడండి: పద్దు 2020 : సాగుకు పెద్దపీట- ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.