హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు యత్నించాయి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేతలు, ఉపాధ్యాయులు.. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా 317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చినా.. కనీసం చర్చించడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చేవారితో చర్చించి.. వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జీవో 317 కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చారు. అయినా కనీసం చర్చించడం లేదు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి. - ఉపాధ్యాయులు
ఇవీ చూడండి..
అట్టహాసంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం
'ఆసుపత్రికి వెళ్లా- ప్రియుడితో పారిపోలేదు'.. మహిళ హైడ్రామా.. మాజీ భర్తతో వాగ్వాదం!