ETV Bharat / state

Telangana tops In CSE ranks : పర్యావరణ హిత కార్యక్రమాల్లో నంబర్ వన్​గా 'తెలంగాణ' - హైదరాబాద్ వార్తలు

Telangana tops in environmental performance : తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. అడవుల పెరుగుదల, మున్సిపల్‌ ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర పర్యావరణహిత కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో శాస్త్ర పర్యావరణ కేంద్రం ‘స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంట్‌’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా.. 7.213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

Telangana tops In CSE ranks
Telangana tops In CSE ranks
author img

By

Published : Jun 5, 2023, 11:48 AM IST

Telangana bags first place in environmental performance : ఒక చెట్టు పెరిగిన తర్వాత ఏడాదికి రూ. కోట్లు విలువ చేసే ఆక్సిజన్​ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉత్పత్తి చేస్తుంది. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రాణవాయువు కొనుగోలు చేయడం ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశమని తేటతెల్లమైంది. చెట్లు నాటడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది. అయితే అభివృద్ధి పేరుతో మానవాళి చర్యల కారణంగా ప్రతి ఏడాది అటవీ ప్రాంతం తగ్గుతూ వస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ సర్కార్ హరితహారం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో అడవుల పెంపకంపై.. పచ్చదనం పెరుగుదలపై దృష్టి సారింది. ఈ క్రమంలోనే పర్యావరణ హితం కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.

World Environment Day Today : ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. అడవుల పెరుగుదల, మురుగునీటి శద్ధి, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ తదితల పర్యావరణహిత కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేవథ్యంలో శాస్త్ర పర్యావరణ కేంద్రం (సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌- సీఎస్‌ఈ) స్టేట్​ ఆఫ్ స్టేట్​ ఎన్విరాన్​మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.

Telangana Top In Environmental Performance : దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా.. 7,213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 2.757 పాయింట్లతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది. మిగిలిన 27 రాష్ట్రాలు 3 నుంచి 7 వరకూ పాయింట్లను సాధించుకున్నాయి. తెలంగాణ తర్వాత వరుస అయిదు స్థానాల్లో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పచ్చదనం వృద్ధిలో ముందుండే ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఈసారి చివరి 10 స్థానాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రెండు, మూడేళ్లుగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టుల నిర్మాణపనుల వల్ల పచ్చదనం వృద్ధిపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

Telangana tops In CSE ranks : మొత్తం 10 పాయింట్లలో అడవుల శాతానికి అత్యధికంగా 3 పాయింట్లు, ముగురునీటి శుద్ధికి 1.5, ఘనవ్యర్థాల శుద్ధికి 1.5, నదీ పరీవాహక ప్రాంతాల కాలుష్యం తగ్గుదలకు 1, సంప్రదాయేతర ఇంధన స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలకు 1, నీటి వనరులకు ఒక్కో పాటింట్​ను సీఎస్ఈ కేటాయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్​ రావు అసాధారణ దూరదృష్టితోనే తెలంగాణలో పచ్చదనం పెరుగుతోందని గ్రీన్ ఇండియా ఛాలెండ్ వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోశ్​కుమార్ అన్నారు. సీఎస్​ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రంకు మొదటి స్థానం రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

సీఎం నిబద్ధతకు గుర్తింపు : సీఎస్​ఈ నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనతను దక్కించుకుందని పేర్కొన్నారు. హరితహారంలో తొమ్మిదేళ్లలో దాదాపు 273 కోట్ల మొక్కల్ని నాటామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 2015-16లో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలో మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 26,969 చదరపు కిలో మీటర్లు పెరిగిందని తెలిపారు.

విద్యుదుత్పత్తిలో దేశంలో తెలంగాణకు రెండోవ స్థానం : హైదరాబాద్​లో వ్యర్థాల నుంచి 24 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తూ.. దేశంలో ఈ రంగంలో రెండోవ స్థానంలో నిలిచామని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి 74 మెగావాట్ల కాగా.. నేడు అదే 5,865 మెగావాట్లకు చేరిందని కేటీఆర్ వివరించారు. హరితహారం ద్వారా అడవీ పునరుద్ధరణ ఫలితమే ఈ గుర్తింపు వచ్చిందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. ఫారెస్ట్ సర్వే ఆప్ ఇండియా 2021 నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అడవీ ప్రాంతం 6.85 శాతం, అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద పచ్చదనం 7.70 శాతం అధికమైందని మంత్రి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.