Telangana tops in online financial frauds 2021: ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ దేశంలో ప్రథమస్థానంలో నిలిచింది. 2021లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 14007 కేసులు నమోదు కాగా.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2003 కేసులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నట్లు కేంద్రం చెప్పింది.
లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2010లో 282 కేసులు నమోదు అయితే.. 2020లో 3316కి చేరుకున్నాయి. 2019లో 172 మందిని అరెస్టు చేయగా.. 2020లో 582 మందిని, 2021లో 743 మంది ఆన్‌లైన్ మోసగాళ్లని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. శిక్షల్లో మాత్రం భారీ తేడా ఉందన్న కేంద్రం.. 2010లో ఇద్దరికి, 2020లో 202 మందికి, 2021లో 3 కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు కేంద్రం పేర్కొంది.
ఇవీ చదవండి: