ETV Bharat / state

CM KCR on Orphans : అనాథలకు అండగా కేసీఆర్ సర్కార్ .. 21 ఏళ్ల వరకు సంరక్షణ బాధ్యత - orphan children policy

Telangana Govt adopts Orphans Policy : నా అనే వారిని కోల్పోయి.. చుట్టూ బంధువులు ఉన్నా ఎవరూ చేరదీయని పిల్లల పరిస్థితి ఎంత దయనీయస్థితిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహమ్మారి కరోనా వచ్చిన తరువాత ఎంతో మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. సమాజంలో నా అనే తోడు లేక పసి బాలలు వీధిన పడ్డారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఆనాథ పిల్లల సంరక్షణకు నడుం బిగించింది. సీఎం కేసీఆర్​ సూచనలు మేరకు మంత్రి వర్గ ఉపసంఘం ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయింది.

CM KCR
CM KCR
author img

By

Published : Aug 3, 2023, 12:37 PM IST

Telangana govt On orphan policy : తెలంగాణలో అనాథ పిల్లల పూర్తి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న పీఎం కేర్స్‌ కన్నా మెరుగైన విధానం తీసుకు రావడంతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు​ సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ప్రభుత్వ సీఎస్​ శాంతికుమారి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Telangana Govt to adopt Orphans : రాష్ట్రంలో కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలతో పాటు ఇతర అనాథ బాలల సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించాలని కేబినేట్​ మీటింగ్​లో నిర్ణయించారు. అనాథల సంరక్షణపై ప్రస్తుతం ఉన్న వేర్వేరు ఉత్తర్వులను ఒకే విధానం కిందకు తీసుకువచ్చేందుకు, సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు రెండేళ్ల క్రితం కేసీఆర్ సర్కార్​.. ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పలు సిఫార్సులు చేసింది.

ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ముఖ్యమైన సిఫార్సులు...

  • అనాథ పిల్లల చదువుకు పూర్తి సహకారం అందించడంతో పాటు వివాహాలు చేసుకుని కుటుంబంతో స్థిరపడేందుకు అవసరమైన సహాయం అందించాలి.
  • అనాథ బాలలకు బీసీ-ఏ కేటగిరీ కింద ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేయాలని పేర్కొన్నారు.
  • గురుకులాల్లో మూడు శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలి.
  • ఆనంద నిలయాలు, బాలసదనాల్ని ఒకే పరిపాలన కిందకు తీసుకురావాలి. ఆనంద నిలయాల్ని బలోపేతం చేయాలి.
  • విక్టోరియా మెమోరియల్‌ హోంలో పదో తరగతి వరకు చదువుకునే అవకాశాలున్నాయి.
  • ఈ విద్యాలయాన్ని కేజీ టు పీజీ విద్యాకేంద్రంగా అప్‌గ్రేడ్‌ చేయాలి. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.

CM KCR On orphans Caring Policy : సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ఇటీవలే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. నివేదికలో మరిన్ని అంశాలను చేర్చాలని కేసీఆర్​ సూచించారు. అనాథ బాలలకు 21 ఏళ్ల వయస్సు వచ్చినంత వరకు ప్రభుత్వమే వారి పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా అనాథ నిలయాలు ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలించాలని పేర్కొన్నారు. అనాథల సంక్షేమంపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మరో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఇందులో మరి కొన్ని నిర్ణయాలు తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.