ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానోపాధ్యాయుల విభాగంలో 12 మందికి.. ఉపాధ్యాయుల విభాగంలో 36 మందికి అవార్డులను ప్రకటించింది.
ప్రణబ్‌ముఖర్జీ సంతాప దినాలు కొనసాగుతున్నందున శనివారం ఉపాధ్యాయ దినోత్సవాలు నిర్వహించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6న సంతాప దినాలు ముగిసిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చూడండి : సుశాంత్ కేసులో షౌవిక్ చక్రవర్తి, శామ్యూల్ అరెస్ట్