ETV Bharat / state

శాసనసభ, మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ

తెలంగాణ అవతరణ వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం జాతీయ జెండా ఆవిష్కరించగా... మండలిలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్​రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్​ విగ్రహాలకు నివాళులు అర్పించారు.

author img

By

Published : Jun 2, 2020, 7:25 AM IST

Updated : Jun 2, 2020, 8:35 AM IST

నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
శాసనసభ, మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ

రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఆవరణలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభలో స్పీకర్ పోచారం జాతీయ జెండా ఆవిష్కరించగా... మండలిలో ఛైర్మన్‌ గుత్తా.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

శాసనసభ, మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ

"అమర వీరుల ప్రాణత్యాగం, వారి బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో.. రాష్ట్ర ప్రగతి కూడా అంతే ముఖ్యం. రాష్ట్రంలో అన్ని విషయాల్లో ఎక్కడా రాజీ లేకుండా పనులు జరుగుతున్నాయి."

-పోచారం శ్రీనివాస రెడ్డి, సభాపతి

శాసనసభ, మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ

"కేసీఆర్​ నాయకత్వంలో 14 ఏళ్లు ప్రజస్వామ్య పద్ధతుల్లో పోరాడి సాధించుకన్నటువంటిది తెలంగాణ. ఈ ఆరు వసంతాల్లో ఎనలేని ప్రగతిని సాధించింది. ప్రధానంగా సంక్షేమ రాష్ట్రాంగానే కాకుండా వ్యవసాయ రాష్ట్రంగా దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత కేసీఆర్​దే."

-​గుత్తా సుఖేందర్​ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్​

కరోనా దృష్ట్యా సభలు, సమావేశాలు లేకుండా వేడుకలు జరుపుకోవాలనే సర్కారు సూచనలను పాటిస్తూ... కార్యక్రమాలను నిర్వహించారు. సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడంతో పాటు భౌతిక దూరం నిబంధనలు పాటించారు.

ఇదీ చదవండి: స్వరాష్ట్రంలో సిక్సర్ కొట్టిన కేసీఆర్

Last Updated : Jun 2, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.