Telangana Congress Govt First Job to Physically Challenged Woman Rajini : తెలంగాణలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరనుంది. ఈ నేపథ్యంలో తొలి ఉద్యోగం హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయికి ఇవ్వనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబ్ గ్యారెంటీలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆ యువతికి జాబ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందించారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందించారు. ఆమెకు రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీకి మొదటి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అక్టోబరు నెలలో ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి దివ్యాంగ మహిళ రజినీకి ఏ ఉద్యోగం రాలేదని తన ఆవేదనను చెప్పుకుంది. తన ఆవేదనను విన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే తొలి ఉద్యోగం ఆమెకు ఇస్తానని మాట ఇచ్చారు. ఇది రేవంత్ గ్యారెంటీ అంటూ అనంతరం ఆయనే స్వయంగా ఆరు గ్యారెంటీ కార్డులో ఆమె పూర్తి వివరాలను అడిగి నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు - ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కసరత్తు
Telangana Congress Six Guarantees : ఆ గ్యారెంటీ కార్డులోని ఆ స్లిప్‌ను తన వద్ద ఉంచుకొని డిసెంబరు 9న జరిగే ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంకు రమ్మని ఆహ్వానించారు. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తొలి ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. అయితే పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రజినీ ఎంత చదివినా, ప్రైవేటు కంపెనీల్లో కూడా ఉద్యోగం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో దివ్యాంగురాలు రజినీకి మొదటి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు.
ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాటి ఫలాలు ఎలా ఉంటాయో చక్కగా ప్రజలకు వివరించడంలో విజయం సాధించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ అనే వాటిపై ముఖ్యంగా ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది యువతనే అని చెప్పవచ్చు.
హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి - ప్రమాణస్వీకారానికి రానున్న సోనియా గాంధీ