ETV Bharat / state

Governor Tamilisai: ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే వేగంగా వ్యాక్సినేషన్.!​

ఆమె తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా గవర్నర్ .... రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే... సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తారు. ఆమెనే గవర్నర్(GOVERNOR) తమిళిసై సౌందర రాజన్(TAMILISAI SOUNDERA RAJAN). వైద్యురాలిగా వేల మందికి సేవ చేసిన అనుభవంతో కరోనా(CORONA PANDEMIC) మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. గవర్నర్​గా రెండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ విజయాన్ని ఇటీవల మరణించిన తన తల్లికి అంకితమచ్చారు.

governor tamilisai soundara rajan
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​
author img

By

Published : Sep 8, 2021, 1:53 PM IST

Updated : Sep 8, 2021, 4:59 PM IST

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోందని గవర్నర్‌(GOVERNOR) తమిళిసై సౌందరరాజన్‌(TAMILISAI SOUNDERA RAJAN) అన్నారు. కొవిడ్ టీకాలు వేగంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ అభినందించారు. తమిళిసై సౌందరరాజన్​ గవర్నర్‌ పదవి స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకుని.. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో "వన్‌ ఏమాంగ్‌ అండ్‌ ఏమాంగ్‌స్ట్‌ ద పీపుల్‌(ONE AMONG AND AMONGST THE PEOPLE)" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన ఆమె తల్లికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు.

గవర్నర్ పదవి కేవలం అలంకార ప్రాయం కాదని.... ప్రజలకు సేవ చేసేందుకు మంచి అవకాశమని ఈ రెండేళ్లలో తమిళిసై అనేకమార్లు చాటి చెప్పారు. రాజకీయ పార్టీల్లో పనిచేయటం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండటం చాలా భిన్నమైనవని... గవర్నర్​గా తాను చేపట్టిన కార్యక్రమాలకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు.. గవర్నర్ సేవలను కొనియాడారు.

ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే వేగంగా వ్యాక్సినేషన్​: గవర్నర్​

వసతులు పెంచాలి

అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా టీకా(CORONA VACCINATION) అందుతుందని గవర్నర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ఉత్పత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాని చెప్పారు. కొవిడ్​ సమయంలో తమవంతుగా రోగులకు కిట్స్​ అందించిన దాతలను గవర్నర్​ అభినందించారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్ క్రాస్, ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాలని గవర్నర్​.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

గవర్నర్​గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం.. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. రాజ్ భవన్ అన్నం, టెలీ మెడిసిన్, రాజ్ భవన్ మహిళలకు బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ సహా.. గత రెండేళ్లలో గవర్నర్​గా చేపట్టిన అనేక కార్యక్రమాలు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇచ్చాయి. తెలంగాణలో ఉన్నత విద్య విలువలు పెంచేందుకు వైస్ ఛాన్స్​లర్​లతో తరచూ చర్చిస్తున్నాం.

-తమిళిసై సౌందరరాజన్​, గవర్నర్​

మీడియా సహకారం ఎంతో ఉంది

కొందరు పిల్లలు తనను ల్యాప్‌టాప్‌లు అడగ్గా... వారికి ఉచితంగా అందించామని గవర్నర్​ తెలిపారు. ఐటీ సంస్థల నుంచి పాత ల్యాప్‌టాప్‌లను సేకరిస్తున్నామని చెప్పారు. వాటిని నిరుపేద పిల్లలకు అందించవచ్చని పేర్కొన్నారు. గవర్నర్​గా తన రెండేళ్ల పదవీకాలంలో రాజ్​భవన్​ సిబ్బంది సహకారం ఎంతో ఉందని తమిళిసై అన్నారు. తాను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని చెప్పారు. అందుకే ప్రజలకు మరింత చేరువయ్యామని స్పష్టం చేశారు.

కౌశిక్​ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై స్టడీ చేయాలి..

ఇక రెండేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలపై మీడియా ప్రశ్నలకు గవర్నర్​ సమాదానం ఇచ్చారు. కేసీఆర్(CM KCR), తనకు మధ్య ఓ గవర్నర్, సీఎంకు ఉండాల్సిన సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్​ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు సీఎం సానుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఎంపికపై స్పందించిన గవర్నర్ ఆ ఫైల్ తన వద్ద ఉందని.. కౌశిక్ రెడ్డి(KOUSHIK REDDY)కి గవర్నర్ కోటా(GOVERNOR QUOTA)లో ఎమ్మెల్సీ(MLC) కేటాయింపుపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు తనకు ఇంకాస్త సమయం కావాలని పేర్కొన్నారు. ఇక గవర్నర్​లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలన్న తమిళిసై.. ఇందుకోసం కనీసం నెలకి ఒకసారి ప్రజాదర్భార్ ఏర్పాటు చేసి.. రాజ్​భవన్​లో సాధారణ ప్రజలను కలిసే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణతో తమకు మొదటి నుంచి సోదర సంబంధాలు ఉన్నాయని గవర్నర్ అన్నారు. అందుకే తాను కొత్త రాష్ట్రానికి గవర్నర్​గా వచ్చిన భావన కలగలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో గవర్నర్​గా తనవంతు సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: TS HIGH COURT: 'ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు'

Last Updated : Sep 8, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.