ETV Bharat / state

కొవిడ్‌ శవాలతో కాసుల వేట.. కనీసం రూ. 25వేలు లేకుంటే కష్టమే - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

కరోనా మృతి చెందిన వారిని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన కొందరు శవాలపై కాసుల వేట ప్రారంభించారు. ఒక్కో శవం కాష్ఠం చేరేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారు.

cremation
కొవిడ్‌ మృతదేహాలతో ప్రైవేటు
author img

By

Published : Apr 24, 2021, 7:13 AM IST

చైతన్యపురిలోని ఓ ఆసుపత్రిలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి(53) కరోనాతో మృతి చెందారు. శ్మశానవాటికలన్నీ మూసేయడంతో శవాన్ని ఎక్కడుంచాలో తెలియని పరిస్థితి. ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించి అంబులెన్సు, ఫ్రీజర్‌ మాట్లాడారు. రూ.40 వేలతో మొదలైన బేరం చివరికి రూ.32 వేలకు తెగింది. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఆ రాత్రి తీరని వేదన తప్పలేదు.
కరోనా కాటేస్తున్నా.. కల్లోలం సృష్టిస్తున్నా.. కాసుల వేటను వదల్లేదు మనిషి! కళ్లముందే జనం పిట్టల్లా రాలిపోతున్నా.. కన్నీళ్లనూ పిండుకుని జేబు నింపుకోలానుకుంటున్న అమానవీయతను చూసి బహుశా ఆ మహమ్మారే విస్తుపోతోందేమో!! రాజధాని సహా అనేక జిల్లాల్లో కొవిడ్‌ మృతదేహాల్ని ఆసుపత్రి నుంచి శ్మశానానికి తరలించేదాకా అడుగడుగునా అగచాట్లే. ఒక్కో శవం కాష్టం చేరేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా చేతిలో ఉండాల్సిందే. ప్రైవేట్‌ అంబులెన్సులు, దళారులు ఆసుపత్రుల ముందే ఈ దందాకు తెరలేపుతున్నారు. గతేడాది హైదరాబాద్‌తో కరోనాతో మృతి చెందినవారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే అంత్యక్రియలను నిర్వహించేవారు. ఈసారి కొన్ని ప్రభుత్వాసుపత్రుల నుంచి మాత్రమే శవాల్ని తరలిస్తోంది. మిగతాచోట్ల మృతుల్ని కుటుంబ సభ్యులకే వదిలేస్తోంది. ఇదే అవకాశంగా దళారీలు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి రూ.25 వేలకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. గ్రేటర్‌లో మూడు శ్మశానాల్లో అధికారికంగా కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు చేస్తున్నారు. మిగతావాటిలో స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు ఉంటేనే అనుమతిస్తున్నట్లు సమాచారం.
* నగరంలో కొవిడ్‌ మృతులకు ఫీడ్‌ ద నీడీ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా అంత్యక్రియలు చేస్తోంది. వివరాలకు 79954 04040 నంబరులో సంప్రదించవచ్చు.

ప్రత్యామ్నాయం చూపించండి

హైదరాబాద్‌లో మా సంస్థ ద్వారా కనీసం 5 నుంచి 10 మందికి రోజూ ఉచితంగా అంత్యక్రియలు చేస్తున్నాం. ఉన్న శ్మశానాలు నిండిపోయి నిరీక్షణ తప్పట్లేదు. కొవిడ్‌ మృతుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.

- కాట్రగడ్డ సాయితేజ, సామాజిక కార్యకర్త

మానేరు తీరంలో ఒకేరోజు 18 శవాల దహనం

కరోనా కల్లోలానికి కరీంనగర్‌ మానేరు నది సమీపంలోని శ్మశానవాటికే సాక్ష్యంగా నిలుస్తోంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ సిబ్బంది పర్యవేక్షణలోనే వారం రోజుల్లో 82 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం 18 శవాలను దహనం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ మరణించిన వారికీ ఇక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. మృతుల కుటుంబీకుల నుంచి దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.