ETV Bharat / state

ఏపీ సర్కార్​ మీద ఒడిశా వేసిన పిటిషన్​పై రేపు అత్యవసర విచారణ

కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా.. తమ భూభాగంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించారని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Delhi_Supreme on Odisha Petetion_Panchayaths_Taza

author img

By

Published : Feb 11, 2021, 7:03 PM IST

తమ భూభాగంలోకి వచ్చే మూడు పంచాయతీల పేర్లు మార్చి.. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. గంజాయ్​పదర్​ను గంజాయ్​భద్రగా, ఫట్టు సెనరీను పట్టుచెన్నూరుగా... ఫగు సెనరీను పగులుచెన్నూరుగా మార్చారని పిటిషన్​లో పేర్కొంది. ఆ మూడు పంచాయతీల్లో గతంలో తాము ఎన్నికలు నిర్వహించినట్లు ఒడిశా స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని అందులో ఆరోపించింది. సీఎస్, ఎస్​ఈసీ నుంచి సంజాయిషీ కోరి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని... ఒడిశా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోరారు. వాదనలు విన్న సీజేఐ బోబ్డే ధర్మాసనం.. రేపు అత్యవసర విచారణ జరిపేందుకు అంగీకరించింది.

ఇదీ చూడండి : తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్‌ పీఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.