హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చిత్ర లేఅవుట్ కాలనీలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కాలనీవాసులు ఎదుర్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంజీరా హైట్స్ ఫేస్ 2 నుంచి సీతాదేవిని భాజాభజంత్రీలతో శ్రీరామనామ స్మరణతో కాలనీలోని సంక్షేమ సంఘం భవనంలోకి తీసుకొచ్చారు. బంజారా హైట్స్ ఫేస్-1లో ఉన్న శ్రీరామలక్ష్మణ, హనుమంతుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కాలనీ సంక్షేమ భవనంలోకి తీసుకొచ్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
గత పది సంవత్సరాలుగా కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా కాలనీ వాసులంతా జరుపుకుంటామని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డి తెలిపారు. ఎదుర్కోలు కార్యక్రమం ముగిసిందని, ఆదివారం జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: జంటనగరాల్లో అట్టహాసంగా శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు