ETV Bharat / state

'ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‌బీ కోర్సులకు ఈనెల 25న స్పాట్ అడ్మిషన్లు'

author img

By

Published : Feb 22, 2021, 3:33 PM IST

ఘట్‌కేసర్‌లోని ఎస్సీ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. బీఏ, ఎల్ఎల్‌బీ కోర్సులకు ఈనెల 25న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Spot admissions for integrated BA and LLB courses on 25th of this month
'ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‌బీ కోర్సులకు ఈనెల 25న స్పాట్ అడ్మిషన్లు'

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎస్సీ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‌బీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. ఈనెల 25న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అడ్మిషన్లు ఉంటాయని వివరించారు.

లాసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఎస్సీలకు 50, బీసీ, మైనారిటీ, ఓసీ, బీసీ-సీలకు నాలుగు చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.